Share News

సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:45 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలన శాఖకు సీఆర్డీఏ అప్పగించింది.

సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత
Amaravati MLA MLC residential complex

అమరావతి, ఆగస్టు 13: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈరోజు(గురువారం) నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలన శాఖకు(జీఏడీ) సీఆర్డీఏ అప్పగించింది. రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని నిర్మించారు. ఒక్కొక్కటి 3,500 చదరపు అడుగుల వైశాల్యంతో 288 ఫ్లాట్లను సీఆర్డీఏ నిర్మించింది.


అత్యాధునిక వసతులతో భవనాలను నిర్మించిన సీఆర్డీఏ.. టవర్స్ మధ్య ప్రత్యేక లాన్స్‌ను పెంచింది. అధునాతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫ్లాట్లను మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇక, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాల అప్పగింత అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ చూసుకోనుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయించే విధానానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

గొడ్డలిపార్టీ రెచ్చగొట్టినా.. రైతులు అమరావతికి సహకరించారు: మంత్రి నారాయణ

గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కొత్త సర్వీసులు ప్రారంభం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 03:06 PM