Share News

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో.. విద్యార్థులే నిందితులు: జిల్లా ఎస్పీ పవార్

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:02 PM

జల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు.

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో.. విద్యార్థులే నిందితులు: జిల్లా ఎస్పీ పవార్

నల్గొండ, ఆగస్టు19: జల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. నిందితుల నుంచి రక్తంతో తడిచిన రూ.1,54,000 నగదుతోపాటు ఐ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.15 రోజుల క్రితం హాస్టల్‌లో ఈ విద్యార్థుల బ్యాగ్‌లో సెల్ ఫోన్‌తోపాటు నగదు దొరకడంతో స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి వారిని మందలించారని తెలిపారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి ఆమె తీసుకెళ్లారని పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో హాస్టల్ నుంచి ఇంటికి వారిని పంపి.. డే స్కాలర్‌గా మార్చారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిపై వారిద్దరు పగ పెంచుకున్నారని అన్నారు. అయితే వారిద్దరిలో ఒకరు మద్యానికి బానిసగా మారారని.. దీంతో ముందే ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఇక యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడంపై ప్లాన్ వేసుకుని.. ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేశారని వివరించారు.


అందుకోసం ముందే కత్తిని వారు కొనుగోలు చేశారని అన్నారు. ఈ చోరీ సమయంలో వీరిని ప్రిన్సిపాల్ గుర్తు పట్టిందని చెప్పారు. దీంతో రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారని వివరించారు. జల్సా చేసేందుకు నెల క్రితం వీరు గోవా కూడా వెళ్లారని తెలిపారు. వీరిద్దరికి గంజాయి టెస్ట్‌ నిర్వహించగా.. నెగిటివ్ వచ్చిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: మల్లు రవి

For More TG News And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 06:17 PM