Share News

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Aug 19 , 2026 | 05:44 PM

ఉచిత పథకాలు, ప్రజాధనం వినియోగంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం కీలక చర్చ జరిగింది. చర్చ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Kalyana Lakshmi scheme

హైదరాబాద్, ఆగస్టు 19: ఉచిత పథకాలు, ప్రజాధనం వినియోగంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం కీలక చర్చ జరిగింది. చర్చ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనం వృథా చేస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి.. ఆ డబ్బును ఉచిత పథకాలకు ఖర్చు చేయొచ్చు కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది.


భూసేకరణలో న్యాయం జరగక బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హైకోర్టు పేర్కొంది. భూ బాధితుల సమస్యలపై ప్రభుత్వం ఏం చేస్తుందో రేపు(గురువారం) చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. కాగా, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు పథకాల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌పై ఉన్న స్టేను ఎత్తి వేయటంపై హైకోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది.


ఇవి కూడా చదవండి

తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం..

Updated Date - Aug 19 , 2026 | 06:43 PM