కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం..
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:16 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో నాలుగు రైల్వే బహుళ మార్గాల ప్రాజెక్టులు కాగా, మరొకటి బిహార్‌లో రహదారి ప్రాజెక్టు (Union Cabinet Decisions).
కేంద్ర కేబినెట్ ఆమోదించిన నాలుగు రైల్వే ప్రాజెక్టుల మొత్తం వ్యయం సుమారు రూ.9,450 కోట్లు. ఇవి నాలుగు రాష్ట్రాల్లో రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించినవి. ముఖ్యంగా గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2,229 కోట్లతో గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఖరగ్‌పూర్-భద్రక్ 4వ లైన్‌కు రూ.3,352 కోట్లు, భద్రక్-హరిదాస్‌పూర్ 4వ లైన్‌కు రూ.1,583 కోట్లు, కటక్-పారాదీప్ 3, 4వ లైన్లకు రూ.2,286 కోట్లు కేటాయించారు (Rs.13,041 Crore Projects).
ఈ రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగనుంది (NH-22 Bihar Cabinet Approval). మొత్తం మీద సుమారు 1.3 కోట్ల టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల రైళ్ల రాకపోకలు కూడా మరింత సులభతరం కానున్నాయి.
అలాగే బిహార్‌లోని ముజఫర్‌పూర్-సీతామర్హి-సోన్‌బర్సా హైవే నిర్మాణానికి కూడా కాబినెట్ నుంచి ఆమోదం లభించింది. నాలుగు లైన్లతో నిర్మించే ఈ హైవేకు రూ.3,591 కోట్లు కేటాయించారు. ఈ రహదారి బిహార్ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడంతో పాటు నేపాల్ సరిహద్దు వైపు రవాణా సౌకర్యాలను బలోపేతం చేయనుంది.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..