Share News

నేను అద్దె కట్టుకోవాలి.. బీజేపీకి రాజీనామాపై షెహజాద్‌ పూనావాలా..

ABN , Publish Date - Aug 19 , 2026 | 04:00 PM

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు.

నేను అద్దె కట్టుకోవాలి.. బీజేపీకి రాజీనామాపై షెహజాద్‌ పూనావాలా..
Shehzad Poonawalla

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా అనంతరం తొలిసారి ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పరిస్థితులను వివరించారు (Shehzad Poonawalla Quits BJP).


పూర్తికాలం రాజకీయాల్లో కొనసాగడం వల్ల తన వ్యక్తిగత ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారిందని పూనావాలా తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అధికార ప్రతినిధులకు లేదా కార్యకర్తలకు జీతాలు చెల్లించవని చెప్పారు. దీంతో ఇంటి అద్దె వంటి సాధారణ ఖర్చులను కూడా భరించడం కష్టంగా మారిందని వివరించారు. 'నేను నా ఇంటి అద్దె చెల్లించాలి. రోజువారీ ఖర్చులు చూసుకోవాలి' అని ఆయన తన పరిస్థితిని వివరించారు. పార్టీపై అసంతృప్తితో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు (BJP Spokesperson).


బీజేపీని వీడాలనే ఆలోచన తనకు అకస్మాత్తుగా రాలేదని పూనావాలా తెలిపారు. పార్టీకి రాజీనామా చేసి ప్రైవేటు రంగంలోకి తిరిగి వెళ్లడం గురించి 2024 నుంచి ఆలోచిస్తున్నానని చెప్పారు (BJP Resignation Shehzad). కొన్ని వారాల క్రితం తాను మొదటిసారి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశానని, ఆ సమయంలో పార్టీ పెద్దలు తనతో మాట్లాడారని వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం తన నిర్ణయం తుది నిర్ణయమని స్పష్టం చేస్తూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసినట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..


పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 19 , 2026 | 04:11 PM