Share News

స్కూటీని ఢీకొన్న టిప్పర్‌.. ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయురాలు దుర్మరణం

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:37 AM

స్కూటీని టిప్పర్‌ లారీ ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

స్కూటీని ఢీకొన్న టిప్పర్‌.. ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయురాలు దుర్మరణం

  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదం

సూర్యాపేట, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్కూటీని టిప్పర్‌ లారీ ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చివ్వెంల మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలికల మినీ గురుకుల పాఠశాలలో మోతె మండలం హుస్సేనాబాద్‌ గ్రామానికి చెందిన కోట్ల రజిత (45) ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే పాఠశాలలో చివ్వెంల మండల పరిధిలోని పిల్లలజగ్గుతండాకు చెందిన గుగులోత్‌ రక్మా (40) కాంట్రాక్టు ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.


శుక్రవారం విధులకు హాజరైన వీరిద్దరూ.. ద్విచక్ర వాహనంపై 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలకు బయలుదేరారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పల్‌ లారీ వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉపాధ్యాయురాలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాలు పైనుంచి వెళ్లడంతో వారి శరీరాలు ఛిద్రమయ్యాయి. ఘటనా స్థలాని చేరుకున్న పట్టణ పోలీసులు.. మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 05:37 AM