Share News

నకిలీ బంగారు ఆభరణాలతో రూ.21లక్షల రుణం

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:31 AM

బ్యాంకు గోల్డ్‌ లోన్‌ మంజూరు చేసే ముందు బంగారు ఆభరణాల నాణ్యతను నిర్ధారించే అప్రైజర్‌.. తాను పని చేస్తున్న బ్యాంకునే మోసగించాడు.

నకిలీ బంగారు ఆభరణాలతో రూ.21లక్షల రుణం
Suryapet Bank Fraud

  • తాను పని చేస్తున్న బ్యాంకుకే అప్రైజర్‌ టోకరా

  • సూర్యాపేట తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఘటన

సూర్యాపేట, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు గోల్డ్‌ లోన్‌ మంజూరు చేసే ముందు బంగారు ఆభరణాల నాణ్యతను నిర్ధారించే అప్రైజర్‌.. తాను పని చేస్తున్న బ్యాంకునే మోసగించాడు. తాను పని చేసే బ్యాంకులో భార్య, ఓ స్నేహితునితో నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టించి రూ.21 లక్షలు రుణంగా కాజేశాడు. బ్యాంకు మేనేజర్‌ మారి తనిఖీల్లో నకిలీ ఆభరణాల బాగోతం బయటపడడంతో పరారయ్యాడు. సూర్యాపేటకు చెందిన ఉపేందర్‌ స్థానిక తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో అప్రైజర్‌గా పని చేస్తున్నాడు.


గోల్డ్‌ లోన్‌ కోసం వచ్చే ఖాతాదారులు తెచ్చే బంగారు ఆభరణాలను తనిఖీ చేసి, విలువ లెక్కకట్టి ఉపేందర్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేస్తుంటారు. 7 నెలల క్రితం తన భార్య శైలజతోపాటు సతీశ్‌ అనే స్నేహితుడితో బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టించాడు. అవి బంగారు ఆభరణాలంటూ ఉపేందర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యాంకు అధికారులు రూ.21 లక్షలు రుణం మంజూ రు చేశారు. అయితే, 3 నెలల క్రితం బ్యాంకు మేనేజర్‌ మారారు. కొత్త మేనేజర్‌ తాకట్టులో ఉన్న బంగారు ఆభరణాలన్నింటినీ మరో అప్రైజర్‌తో పరిశీలన చేయించారు. ఈ పరిశీలనలో నకిలీ ఆభరణాల బాగోతం బయటపడింది. దీంతో బ్యాంకు మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఉపేందర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 18 , 2026 | 05:31 AM