Share News

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:45 PM

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేదిక అకస్మాత్తుగా కుప్పకూలింది.

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
Vemula Veeresham

నల్లగొండ, మార్చి 27: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంకు(MLA Vemula Veeresham) తృటిలో ప్రమాదం తప్పింది. కేతేపల్లి మండలం బండపాలెంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేదిక అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని వెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. సీతారాముల కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇలాంటి సమయంలో వేదిక కూలడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ అపశృతి జరిగిందంటూ తీవ్రంగా విమర్శించారు.


ఇవి కూడా చదవండి...

సైబర్‌ నేరగాళ్ల వలలో మాజీ ప్రొఫెసర్.. కోటి స్వాహా

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న జెండా ఆవిష్కరణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 27 , 2026 | 04:46 PM