Share News

రణరంగంగా మారిన నల్లగొండ.. కాంగ్రెస్, బీజేపీ దాడి, ప్రతిదాడులతో ఉద్రిక్తతలు..

ABN , Publish Date - Aug 31 , 2026 | 07:51 PM

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య దాడి, ప్రతిదాడులు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు తెరలేపాయి. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ప్రతి దాడికి యత్నించాయి.

రణరంగంగా మారిన నల్లగొండ.. కాంగ్రెస్, బీజేపీ దాడి, ప్రతిదాడులతో ఉద్రిక్తతలు..
Congress vs BJP

నల్లగొండ: జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య దాడి, ప్రతిదాడులు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు తెరలేపాయి. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ప్రతి దాడికి యత్నించాయి. పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్దకు హస్తం పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ జిల్లా కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కార్యాలయంపై దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడిని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విభేదాలతో దాడులకు తెగబడటం సరికాదని ఆయన పేర్కొన్నారు.


క్లాక్‌టవర్‌ వద్ద కాంగ్రెస్ నిరసన..

అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి పాదయాత్రగా కాంగ్రెస్ శ్రేణులు క్లాక్‌టవర్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ నిరసన చేపట్టి కమలం పార్టీ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డిపై వెంటనే పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు భారీగా మోహరించి, ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో నల్లగొండలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

మూసారాంబాగ్ హైలెవ‌ల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

కేసీఆర్‌ పెట్టిన తిండి తిని ప్రశాంత్ రెడ్డి తండ్రీకూతుళ్లను విడదీశారు: కల్వకుంట్ల కవిత

Updated Date - Aug 31 , 2026 | 07:51 PM