Share News

అడుగంటుతున్న ‘సాగర్‌’ నీటి మట్టం

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:54 AM

నాగార్జునసాగర్‌ జలాశయంలో నీటి మట్టం అడుగంటుతోంది.

అడుగంటుతున్న ‘సాగర్‌’ నీటి మట్టం

  • కాల్వలకు నీటి విడదలే కారణం

నాగార్జున సాగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ జలాశయంలో నీటి మట్టం అడుగంటుతోంది. గత నాలుగు రోజులుగా కుడి, ఎడమ కాల్వలకు రోజుకు 14,872 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. దీంతో సాగర్‌ నీటిమట్టం రోజుకు అర అడుగు చొప్పున తగ్గుతూ, ఆదివారం సాయంత్రానికి 532.20 అడుగులకు (172.671 టీఎంసీలు) చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 590 అడుగుల (312.945 టీఎంసీలు) కంటే ఇది 57.8 అడుగులు తక్కువ.


రోజూ ఎడమ కాల్వ ద్వారా 6,478 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 6,394 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి, వరద కాల్వకు ఎలాంటి నీటి విడుదల లేదు. ప్రాజెక్టు నుంచి రోజుకు 14,872 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండగా, శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రం నుంచి 3,844 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. మరో 22 అడుగుల నీటిని సాగర్‌ జలాశయం నుంచి విడుదల చేస్తే, నీటి మట్టం కనిష్ఠ స్థాయి 510 అడుగులకు చేరుకుంటుంది.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్

Updated Date - Nov 30 , 2026 | 04:54 AM