Share News

సీఎం రేవంత్‌కు ఓటమి తప్పదు: ఎంపీ అర్వింద్

ABN , Publish Date - Jun 10 , 2026 | 07:55 PM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి చదువు రాదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

సీఎం రేవంత్‌కు ఓటమి తప్పదు: ఎంపీ అర్వింద్
BJP MP Dharmapuri Arvind

భువనగిరి, జూన్10: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి చదువు రాదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బుధవారం భువనగిరిలో ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్‌పై ఈ రాష్ట్రంలో కేసు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి ఎలా తెలిసిందంటూ సందేహం వ్యక్తం చేశారు.


ఇది రేవంత్ రెడ్డి కుట్రో, కాంగ్రెస్ పార్టీ కుట్రో వాళ్లే తెలుసుకోవాల్సి ఉందని బీజేపీ ఎంపీ అభిప్రాయపడ్డారు. బీజేపీ నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండడం సహజమన్నారు. నరేంద్రమోదీ చరిష్మాను ఓట్లుగా మార్చకోవడంలో తెలంగాణ బీజేపీ విఫలమైందని విమర్శించారు. అక్రమ ఇసుక రవాణాకు లారీలు దొరుకుతున్నాయి.. కానీ ధాన్యం రవాణాకు దొరకడం లేదా? అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో బీజేపీ విజయం సాధించడం సులభమన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి 32 లక్షల టన్నుల బియ్యం బకాయిగా ఉందని చెప్పారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్షం లేదన్నారు. కానీ నేడు చాలా ప్రతిపక్షాలు ఉన్న సమయంలో 12 ఏళ్ల పాటు మోదీ ప్రధానిగా ఉన్నారని ఎంపీ అర్వింద్ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్టీల్ ప్లాంట్ పదం పలకడానికి అర్హత లేని వ్యక్తి జగన్: మంత్రి అనిత

స్టడీ సర్కిళ్ల బలోపేతంతో డీఎస్సీలో పలువురికి ఉద్యోగాలు: మంత్రి డోలా

For More TG News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 08:02 PM