స్టీల్ ప్లాంట్ పదం పలకడానికి అర్హత లేని వ్యక్తి జగన్: మంత్రి అనిత
ABN , Publish Date - Jun 10 , 2026 | 07:14 PM
స్టీల్ ప్లాంట్ అనే పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి అనిత మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు.
విశాఖపట్నం, జూన్ 10: స్టీల్ ప్లాంట్ అనే పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి అనిత మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు. ఈ ఘటనలో మృతులు కుటుంబాలకు లైఫ్ టైం భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ రోజు విశాఖపట్నంలో బాధితుల పరామర్శ కోసం పులివెందుల శాసనసభ్యుడు ఆసుపత్రి వద్దకు వస్తే.. రప్పా రప్పా బ్యాచ్ అరుపులు అరిచారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పరామర్శకు వచ్చి.. రాజకీయాలా? అంటూ వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా మంత్రి అనిత సూటిగా ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉండాలని జగన్‌కు ఆమె సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు రాజధానికి వినియోగిద్దామని సీఎంగా జగన్ పేర్కొన్నారంటూ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి అనిత గుర్తు చేశారు. అది వైఎస్ జగన్‌కి స్టీల్ ప్లాంట్ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యంగ్యంగా అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నా చేస్తుంటే ఒక్క రోజు కూడా వారి వద్దకు జగన్ వెళ్లలేదని పేర్కొన్నారు. మీ ఐదేళ్ల పాలనలో ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని తీసుకువచ్చారా? అంటూ వైసీపీ అధినేతను సూటిగా ప్రశ్నించారు.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని చెబుతున్నారని.. ఆ సంస్థ సుమారు రూ.150 కోట్లు ప్రభుత్వానికి జమ చేసిందని గుర్తు చేశారు. ఎల్జీ పాలిమార్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన ఆ ముగ్గురికి కోటి రూపాయిలు ఎందుకు ఇవ్వలేదంటూ జగన్‌ను మంత్రి వంగలపూడి అనిత సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఒక కాంట్రాక్టు కార్మికుడు చనిపోతే ఉద్యోగ రావడం ఇదే మొదటిసారి అని అనిత వివరించారు. స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రానికి లేఖలు రాశానని చెబుతున్నావు కానీ.. గంగవరం పోర్టులో 10.24 శాతం రాష్ట్ర వాటా ఏం చేశారంటూ జగన్‌ను ఈ సందర్భంగా వంగలపూడి అనిత నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్టడీ సర్కిళ్ల బలోపేతంతో డీఎస్సీలో పలువురికి ఉద్యోగాలు: మంత్రి డోలా
హత్య కేసులో 13 మంది నిందితులకు జీవిత ఖైదు
For More AP News And Telugu News