హత్య కేసులో 13 మంది నిందితులకు జీవిత ఖైదు
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:27 PM
హత్య కేసులో మార్కాపురం విఐ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం రాజుపాలెంకు చెందిన కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
మార్కాపురం, జూన్ 10: హత్య కేసులో మార్కాపురం విఐ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం రాజుపాలెంకు చెందిన కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బుధవారం ఈ కేసు విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
దీంతో ఈ కేసులో నిందితులు చల్లా వెంకటేశ్వర్లు, చల్లా వెంకట నరసింహం, సన్నెబోయిన కృష్ణయ్య, చల్లా శ్రీను, లోమడ హరిబాబు, చల్లా అనిల్, చలివేంద్ర ప్రసాద్, చల్లా రమేష్, చల్లా నాగయ్య, దోసపాటి వెంకటయ్య, దోసపాటి శ్రీనివాసులు, జూపల్లి శివయ్య, చల్లా రవిలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. రాజుపాలెం గ్రామంలో బొడ్డు రాయి విషయంలో వ్యక్తుల మధ్య ఘర్షచోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కంచర్ల శ్రీనును దారి కాచి 13 మంది హత్య చేశారు. ఈ నేరం రుజువు కావడంతో నిందితులకు కోర్టు శిక్ష విధించింది.
మార్కాపురం డివిజన్‌లోని పొదిలి మండలం రాజుపాలెంలో 2017లో వైసీపీ నేత కంచర్ల శ్రీనివాసులు (శ్రీను)ను హత్య చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కోర్టులో ఈ కేసుకు సంబంధించి దాదాపు తొమ్మిదేళ్ల పాటు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చివరకు బుధవారం ఈ హత్య కేసుపై తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో 13 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో వారికి కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదు నెలల్లో రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు అన్నదానం: టీటీడీ
రాజధాని అమరావతికి కేంద్రం భారీ శుభవార్త: కేంద్ర మంత్రి పెమ్మసాని
For More AP News And Telugu News