ఐదు నెలల్లో రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు అన్నదానం: టీటీడీ
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:56 PM
తిరుమలలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులకు అన్నదానం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే మాసం వరకు 4.4 కోట్ల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు టీటీడీ తెలిపింది.
తిరుపతి, జూన్10: తిరుమలలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులకు అన్నదానం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే మాసం వరకు 4.4 కోట్ల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు టీటీడీ తెలిపింది. 15.8 టన్నుల బియ్యంతో నిత్యం 3 లక్షల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు వివరించింది. ఈ ఏడాది జనవరి మాసంలో కోటి, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్‌లో 85 లక్షలు, మే నెలల్లో 92 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు గణాంకాలతో సహా టీటీడీ పేర్కొంది.
గత మూడు నెలలుగా నిత్యం 60 వేల మంది భక్తులకు అల్పాహారం,1.56 లక్షల మందికి భోజనం,70 వేల మంది భక్తులకు పాలు, టీ, కాఫీ పంపిణీ చేసినట్లు టీటీడీ చెప్పింది. మరో వైపు అన్నప్రసాదం ట్రస్టుకు అందిన విరాళాలు రూ.2,500 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. విరాళాలపై వచ్చే వడ్డీతో పాటు పలువురు భక్తులు ఉచితంగా ఇస్తున్న కూరగాయలతో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.
రికార్డు స్థాయిలో తలనీలాలు..
ఇక ఈ ఏడాది తలనీలాలను కూడా భక్తులు రికార్డు స్థాయిలో స్వామి వారికి సమర్పించారు. మే మాసంలో 12,43,063 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు ఇచ్చారు. మే 1 నుంచి మే 27వ తేదీ వరకు శ్రీవారికి మొక్కుల రూపంలో భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. గతంలో ఉన్న రికార్డులను ఇది అధిగమించిందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొమురవెల్లి మల్లన్నకు ఇన్‌చార్జి గ్రహణం!
నేటి రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..
For More Devotional News And Telugu News