ఈదురు గాలులు.. భారీ వర్షం
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:38 AM
ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండుతున్న వేళ కురిసిన భారీ వర్షంతో ప్రజలకు ఊరట లభించింది. కానీ, ఈదురు గాలుల ప్రభావంతో యాదాద్రి-భువనగిరి జిల్లాలో భారీ వర్షానికి వరి పైరు నేలకొరిగింది.
భువనగిరి జిల్లాలో నేలకొరిగిన వరి
జలాల్‌పూర్‌లో 6.9 సెం.మీ వర్షపాతం నమోదు
భూదాన్‌పోచంపల్లి/మోత్కూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండుతున్న వేళ కురిసిన భారీ వర్షంతో ప్రజలకు ఊరట లభించింది. కానీ, ఈదురు గాలుల ప్రభావంతో యాదాద్రి-భువనగిరి జిల్లాలో భారీ వర్షానికి వరి పైరు నేలకొరిగింది. అత్యధికంగా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో 6.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో 6.3 సెం.మీ, బీబీనగర్ మండలం వెంకిర్యాలలో 3.2 సెం.మీ, మోత్కూరులో 4 మి.మీ, బీబీనగర్‌లో 1.5 మి.మీ వర్షం కురిసింది.
భూదాన్‌పోచంపల్లి మండలం జగత్‌పల్లి, పెద్దగూడెం ముక్తాపూర్, జూలూరు, కాప్రయిపల్లి, రేవణపల్లి గౌసుకొండ తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి కోత దశకు వచ్చిన వరి నేలకొరిగింది. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో శనివారం రాత్రి కురిసిన వర్షంతో చేకూరి వెంకన్న అనే రైతుకు చెందిన 8.5 ఎకరాల వరిపొలం నేలకొరిగింది. తేలికపాటి వర్షమే కురిసినా గాలి వీయడంతో పంట నేలకొరిగి నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్‌కో నుంచే...
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International