నిమ్మతోటలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - May 02 , 2026 | 12:15 AM
తిప్పర్తి, మే 1(ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం శివారులో శుక్రవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో నిమ్మతోటతో పాటు కొట్టం అందులో ఉన్న నిమ్మకాయలు కాలి బూడిదయ్యా యి
కొట్టంలో నిల్వ ఉంచిన 60 బస్తాల నిమ్మకాయలు ,
40 నిమ్మ చెట్లు దగ్ధం
తిప్పర్తి, మే 1(ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం శివారులో శుక్రవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో నిమ్మతోటతో పాటు కొట్టం అందులో ఉన్న నిమ్మకాయలు కాలి బూడిదయ్యా యి. స్థానికులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం శివారులో కంచర్ల వివేకానందరెడ్డికి సం బంధించిన నిమ్మతోటను తిప్పర్తి గ్రామానికి చెందిన నూ కల విజయ్ సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు నిమ్మతోటతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న వరికొయ్యలు, పొలం వద్ద ఉన్న కొట్టం పూర్తిగా వ్యాపించాయి. తోటలో కాయలు కోస్తున్న రైతు గమనించి కాయలను తొలగించే ప్రయత్నం చేసే లోపు మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేయడంతో నల్లగొండ నుంచి సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే వేగంగా వీచిన గాలులతో కొట్టంలో ఉన్న 60 బస్తాల నిమ్మకాయలు, మోటర్, పైపులు, దాదాపుగా 40 నిమ్మచెట్లు పూర్తిగా కాలిపోయినట్లు రైతు తెలిపారు. ఈ సుమారుగా రూ. 5 లక్షలకు పైగా నష్టపోయానని రైతు తెలిపారు. స్థానిక విద్యుత్ తీగలు ఒకదానిపై ఒక్కటి పడడంతో నిప్పురవ్వలు లేచి గడ్డిలో పడినట్లు రైతులు తెలుపుతున్నారు. కొన్ని రోజులుగా విద్యుత్ వైర్లు గాలికి తాకుతుండడంతో నిప్పురవ్వలు లేస్తున్నట్లు వారె చెప్పారు. పగలు, రాత్రి కష్టపడి చేసిన శ్రమ పూర్తిగా నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరా రు. ప్రమాదం జరిగిన స్థలం నుంచి మరో 500 మీటర్ల దూరంలో మర్రిగూడ గ్రామానికి చెందిన ఇళ్లు కూడా ఉన్నాయి. ఫైర్ ఇంజన్ సమయానికి రావడం ఆలస్యమైతే పెను ప్రమాదం జరిగేదని గ్రామస్థులు తెలిపారు.
కొనుగోలు కేంద్రానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
చిలుకూరు : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి శుక్రవారం భారీ అగ్నిప్రమాదం తప్పింది. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని 14 మండలాలకు కేంద్ర బిందువుగా ఉన్న స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో కోదాడ, హుజూర్‌నగర్ రహదారి పక్కన కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం రైతులు పొలాల్లో వరి కొయ్యలను తగల బెట్టారు. క్రమంగా అగ్ని వ్యాపించి వందల ఎకరాల్లో కాలు తూ సమీపాన ఉన్న మొక్క జొన్న కొనుగోలు కేంద్రానికి చేరుకుంది. గమనించి స్థానికులు, కొనుగోలు కేంద్ర సి బ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. సుమారు 20 రాశుల మొక్కజొన్న నిల్వలు కేంద్రంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంటలు అదుపు కానట్లయితే ప్రమాదం తీవ్రంగా ఉండేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.