Share News

ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీ విధానాలపై ఐక్య పోరు!

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:08 AM

ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ ఐక్యంగా విస్తృత పోరాటాలు చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ ధవలే పిలుపునిచ్చారు.

ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీ విధానాలపై ఐక్య పోరు!
AIKS National Convention

  • వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక శక్తులు ఏకం కావాలి..

  • బీజేపీ పాలన కొనసాగితే అన్ని వర్గాలపై దాడులు తీవ్రం

  • కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలి

  • ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ ధవలే

నల్లగొండ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ ఐక్యంగా విస్తృత పోరాటాలు చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ ధవలే పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగితే రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలతో పాటు అన్ని వర్గాల ప్రజలపై దాడులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. ఏఐకేఎస్‌ 36వ జాతీయ మహాసభల్లో భాగంగా సోమవారం రెండో రోజు నల్లగొండ జిల్లా కేంద్రలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


దేశీయ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కేంద్రం అమలు చేస్తోందని విమర్శించారు. ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తుల రాజకీయ, సైద్ధాంతిక ప్రభావం ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలకు ముప్పుగా పరిణమిస్తోందన్నారు. ఈ శక్తులను ఎదుర్కొనేందుకు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సైద్ధాంతిక రంగాల్లో ఐక్య పోరాటాలు సాగించాలని సూచించారు. కేవలం రాజకీయ ఆందోళనలకే పరిమితం కాకుండా ప్రజల్లో నిరంతరం చైతన్యం కల్పించాలని ధవలే అన్నారు. వామపక్ష ఉద్యమాలను,ముఖ్యంగా ఏఐకేఎస్‌ సంస్థాగత బలాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.


26న దేశవ్యాప్త రైతాంగ ఉద్యమం

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాలతోనే ఎదుర్కోగలమని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ స్పష్టం చేశారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో 13నెలల పాటు సాగిన రైతు ఉద్యమం ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈనెల 26న దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల సమస్యల నుంచే ప్రజా ఉద్యమాలు మొదలవుతాయని రాకేశ్‌ టికాయత్‌ అన్నారు. ఈ మహాసభలో ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌, రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, కార్యదర్శి తీగల సాగర్‌, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 06:08 AM