Share News

విద్యార్థులు, పరిశ్రమలను కలిపే జాబ్ పోర్టల్.. దేశంలోనే తొలిసారి: మంత్రి వివేక్

ABN , Publish Date - Aug 17 , 2026 | 02:45 PM

దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలను విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.

విద్యార్థులు, పరిశ్రమలను కలిపే జాబ్ పోర్టల్.. దేశంలోనే తొలిసారి:  మంత్రి వివేక్
Vivek Venkataswamy

మెదక్, ఆగస్టు 17: దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలను విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈరోజు(సోమవారం) జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని పారిశ్రామిక ప్రాంతంలో జాబ్ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వెయ్యి పరిశ్రమలు ఉన్నాయని.. స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరం ఉందని అన్నారు. జిల్లా యంత్రాంగం, పరిశ్రమల యజమానులు కలిసి చేస్తున్న మంచి ప్రయత్నం ఇది అని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో, దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందన్నారు. టామ్ కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు.


స్థానిక పరిశ్రమలకు కూడా ఉద్యోగులను, స్కిల్డ్ లేబర్‌ను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు కేవలం సాఫ్ట్‌వేర్ పైనే దృష్టి సారించకుండా... ఇంకా చాలా రంగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. సింగరేణి ప్రాంతం మందమర్రిలో జర్మన్ నేర్పిస్తున్నామని.. వారిలో బీ2 లెవల్ వచ్చిందన్నారు. వారి కోసం రూ.25 లక్షల జీతం ఎదురుచూస్తోందని తెలిపారు. వీసా ఖర్చులను కూడా సగం వరకూ ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. విదేశాలకు వెళ్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 02:56 PM