వర్గల్ బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:51 AM
రాష్ట్రంలో బుధవారం వెలుగు చూసిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని బాలురు వసతి గృహంలో రామ్‌చరణ్ (15) అనే పదో తరగతి విద్యార్థి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
లా మెంటారా కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
వర్గల్, ఆదిభట్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం వెలుగు చూసిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని బాలురు వసతి గృహంలో రామ్‌చరణ్ (15) అనే పదో తరగతి విద్యార్థి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని లా మెంటారా కాలేజీ హాస్టల్ గదిలో మోక్షజ్ఞ అనే ఇంటర్ ఫస్టియిర్ విద్యార్థీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన రాంచరణ్ (15) వర్గల్‌లోని బాలుర వసతి గృహంలో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రెండ్రోజులుగా తరగతులకు గైర్హాజరైన రాంచరణ్ బుధవారం పాఠశాలకు వెళ్లాడు. పాఠశాలకు ఎందుకు రాలేదని, హోంవర్క్ ఎందుకు చేయలేదని రాంచరణ్‌తో పాటు పలువురు హాస్టల్ విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు మందలించారు.
ఆ తర్వాత పాఠశాల నుంచి ఉదయం 11 గంటలకు బయటకు వెళ్లిన రాంచరణ్ హాస్టల్ గదిలోకి వెళ్లి స్లాబ్ ఇనుప రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మరో ఘటనలో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముండే నాగేశ్వరరావు కుమారుడు మోక్షజ్ఞ.. ఆదిభట్ల టీసీఎస్ ఎదురు గా ఉన్న లా మెంటారా కాలేజీ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతున్నాడు. మోక్షజ్ఞకు మంగళవారం జ్వరం రావడంతో హాస్టల్ గదిలో విశ్రాంతి తీసుకున్నాడు. ఇతర విద్యార్థులు మంగళవారం రాత్రి స్టడీ అవర్‌కు వెళ్లగా మోక్షజ్ఞ మాత్రం గదిలోనే ఉన్నాడు. స్టడీ అవర్ అనంత రం తోటి విద్యార్థులు గదికి వచ్చేసరికి మోక్షజ్ఞ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. విషయం తెలిసిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు.. కాలేజీ ఎదుట విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మంగళవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News