Share News

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం

ABN , Publish Date - May 16 , 2026 | 02:42 PM

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఏప్రిల్14న రామాయంపేటకు చెందిన నందిని డెలివరీ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతోందని డాక్టర్ సింధూరి కాటన్ పెట్టారు.

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం
Siddipet Hospital Negligence

సిద్దిపేట, మే 16: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. గత నెల(ఏప్రిల్) 14న రామాయంపేటకు చెందిన నందిని డెలివరీ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతోందని డాక్టర్ సింధూరి కాటన్ పెట్టారు. అయితే కాటన్ తొలగించేందుకు మళ్లీ రావాల్సి ఉంటుందని పేషెంట్‌కు చెప్పడం మర్చిపోయారు డాక్టర్. దీంతో నెల రోజులుగా నందిని శరీరంలో కాటన్ అలాగే ఉండిపోవడంతో ఇన్ఫెక్షన్‌తో ఆమె అనారోగ్యానికి గురైంది.


రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో నందిని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. దీంతో ప్రభుత్వ డాక్టర్ చేసిన నిర్వాకం బయటపడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్ తేల్చి చెప్పారు. దీంతో నందిని కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన నందిని కుటుంబసభ్యులు, బంధువులు.. వైద్యుల నిర్లక్ష్యంపై నిలదీస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల తీరుపై బాధితులు, పేషెంట్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే: సీఎం

తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ప్రారంభం: సుదర్శన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 16 , 2026 | 02:51 PM