క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Sep 22 , 2026 | 09:42 PM
పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పటాన్‌చెరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 22: పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పటాన్‌చెరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 12వ తేదీన హైదరాబాద్‌లో కొందరు వ్యక్తులు క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఈ క్యాబ్ రుద్రారం సమీపంలో రాగానే.. వైర్‌తో డ్రైవర్ రాజశేఖర్‌ను హత్య చేశారు. డ్రైవర్ మృతదేహాన్ని రహదారి పక్కన పడేశారు. అనంతరం ఆ కారులో వారంతా కోహిర్ వరకు వెళ్లారు. అక్కడ కారు ఆగిపోయింది. దీంతో ఆ కారును అక్కడ వదిలి పరారయ్యారు.
రహదారి పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ముఠా సభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. కారును చోరీ చేసేందుకు ఈ ముఠా.. ప్రయాణికుల రూపంలో క్యాబ్ బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అలిసిపోయావంటూ క్యాబ్ డ్రైవర్‌ను పక్కన కూర్చొబెట్టుకుని వారు కొంత దూరం ఆ కారును డ్రైవ్ చేశారు.
అనంతరం క్యాబ్ డ్రైవర్‌ను హత్య చేసి.. మృతదేహాన్ని రుద్రారం పరిసర ప్రాంతాల్లో పడేశారు. పోలీసుల దర్యాప్తులో సీసీ టీవీ కెమెరాలు, క్యాబ్ బుకింగ్ ద్వారా ఆధారాలతో మహారాష్ట్రలో నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే దొంగిలించిన క్యాబ్‌ను సంగారెడ్డి జిల్లాలోని బుధేరా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో నలుగురు మహారాష్ట్ర, మరొకరు ఢిల్లీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. నిందితుల నేర చరిత్రపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
వీధిలో డీజే.. గుండెపోటుతో 2వ తరగతి బాలిక మృతి
ఆయుర్వేద ఆసుపత్రుల అభివృద్ధికి భారీగా నిధులు: సత్యకుమార్