వీధిలో డీజే.. గుండెపోటుతో 2వ తరగతి బాలిక మృతి
ABN , Publish Date - Sep 22 , 2026 | 08:55 PM
వీధిలో భారీ డీజే శబ్దంతో నిర్వహించిన ఊరేగింపు కారణంగా స్కూల్లో రెండో తరగతి బాలిక గుండెపోటుతో మరణించిన ఘటన యూపీలో వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: వీధిలో భారీ డీజే శబ్దంతో నిర్వహించిన ఊరేగింపు కారణంగా స్కూల్లో రెండో తరగతి బాలిక గుండెపోటుతో మరణించిన ఘటన యూపీలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. స్కూలు పక్క నుంచి పెద్ద శబ్దంతో డీజేతో ఊరేగింపు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఊరేగింపు సమయంలోనే తమ బిడ్డ అనారోగ్యం దిగజారడం ప్రారంభించిందని బాలిక తండ్రి తెలిపారు. ఆమెకు స్వల్ప వ్యవధిలో మూడు సార్లు గుండె పోటు వచ్చినట్టు తెలిసింది. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
సీసీటీవీ దృశ్యాల ప్రకారం, మొదట బాలిక కాస్త అస్వస్థతకు గురైంది. సీటులోంచి కిందకు జారిపోయింది. తల పక్కకు వేలాడేసింది. పక్కనే ఉన్న బాలుడు ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. మొదట లేచేందుకు ప్రయత్నించిన బాలిక కాస్త కోలుకున్నట్టే కనిపించింది. ఆ తరువాత మరుక్షణం సీటులోంచి కిందుకు జారిపోయింది. ఆ సమయంలో పెద్ద శబ్దంతో డీజే ప్లే చేశారని స్కూల్ నిర్వాహకుడు కూడా తెలిపారు.
ఈ వార్తలను చదవండి:
వైభవంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు చిత్రాలకు 9 అవార్డులు
ఆ నోటీసులకు కారణం ఏంటి.. ఈసీకి సుప్రీం ప్రశ్న