వైభవంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు చిత్రాలకు 9 అవార్డులు
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:54 PM
గుజరాత్ వేదికగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 9 తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లో వైభవంగా జరిగింది. రాష్ట్రంలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజరాత్‌లో అవార్డు ప్రదానోత్సవం జరగడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలువురు సినీకళాకారులు పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు.
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, బాలీవుడు నటుడు కార్తిక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. చందూ ఛాపియన్ చిత్రానికి కార్తిక్ ఆర్యన్‌ను, భ్రమయుగం చిత్రానికి మమ్ముట్టిని ఈ అవార్డు వరించింది. కల్కీ 2898 ఏడీ ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 నిలిచింది. ఆ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అమరన్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియసామి అవార్డును అందుకున్నారు. ఈసారి తెలుగు సినిమాలు కూడా సత్తా చాటాయి. ‘కల్కి 2898’తో పాటు ‘కమిటీ కుర్రోళ్లు’, ‘35.. చిన్న కథ కాదు’, ‘పుష్క-2’, ‘లక్కీ భాస్కర్’ సహా పలు చిత్రాలు వివిధ విభాగాల్లో మొత్తం 9 అవార్డులను సొంతం చేసుకున్నాయి.
చలనచిత్ర అవార్డుల ప్రదాన కార్యక్రమం సాధారణంగా ఢిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. 1954 నుంచి ఈ వేదికగానే అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 1971లో ఓసారి మాత్రమే చెన్నైలో జరిగింది. ఇక కరోనా సమయంలో రెండేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు.
ఈ వార్తలనూ చదవండి:
ఆ నోటీసులకు కారణం ఏంటి.. ఈసీకి సుప్రీం ప్రశ్న
‘డాక్టర్ నా కళ్లను తీసేశారు’.. మొబైల్ అవగాహన కార్యక్రమంలో చిన్నారుల్లో భయం!