Share News

సీఎంఆర్‌ తీసుకోం..ఈ ఒత్తిళ్లు తట్టుకోలేం

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:03 AM

ప్రభుత్వం నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) తీసుకోరాదన్న అభిప్రాయానికి మెదక్‌ జిల్లా రైస్‌ మిల్లర్లు వచ్చారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి తమపై ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంఆర్‌ తీసుకోం..ఈ ఒత్తిళ్లు తట్టుకోలేం
CMR Rice Procurement

  • మెదక్‌ జిల్లా రైస్‌ మిల్లర్ల అభిప్రాయం

  • నిబంధనలు భారంగా మారాయని ఆవేదన

మెదక్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) తీసుకోరాదన్న అభిప్రాయానికి మెదక్‌ జిల్లా రైస్‌ మిల్లర్లు వచ్చారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి తమపై ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మెదక్‌లోని మార్కెట్‌ యార్డులో ‘రాష్ట్ర రా రైస్‌ మిల్లర్ల సంఘం’ ప్రధాన కార్యదర్శి వీరేశం, జిల్లా అధ్యక్షుడు చంద్రపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి 110 మంది రైస్‌ మిల్లుల యజమానులు హాజరయ్యారు. ఇందులో దాదాపు 105 మంది మిల్లర్లు సీఎంఆర్‌ తీసుకోవద్దనే అభిప్రాయం వ్యక్తం చేశారు. క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యం అప్పగించడంతో పాటు బ్యాంకు గ్యారెంటీ, మరో ఇద్దరు మిల్లర్ల ష్యూరిటీ వంటి నిబంధనలు తమకు భారంగా మారాయన్నారు.


ఒప్పంద ప్రక్రియలోనే పలు షరతులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ధాన్యం ఎంత వచ్చింది? ఎంత మిల్లింగ్‌ చేశారు? ఎంత అప్పగించారు? తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని.. చిన్న తేడా వచ్చినా తనిఖీల సమయంలో వివరణ ఇవ్వాల్సి వస్తోందని వాపోయారు. ‘‘సీఎంఆర్‌ బకాయిలు చెల్లించలేక దొంగలుగా ముద్ర వేయించుకుంటున్నాం. గౌరవంగా వ్యాపారం చేసుకునే మమ్మల్ని నేరస్థులుగా చూస్తున్నారు’’అని సమావేశంలో మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యం లేదా 68 కిలోల ఉప్పుడు బియ్యం మరపట్టి ఇవ్వలేమని, అంత బియ్యం రావడం లేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:03 AM