Share News

రాజ్యసభ సభ్యుల ఎంపికపై కీలక చర్చ.. తెరపైకి పలువురి పేర్లు

ABN , Publish Date - Mar 02 , 2026 | 05:50 PM

వికారాబాద్ వేదికగా జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై పార్టీ అగ్రనేతలు మధ్య సోమవారం కీలక చర్చ జరిగింది. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నేతలను పార్టీ అగ్రనేతలు సూచించారు.

రాజ్యసభ సభ్యుల ఎంపికపై కీలక చర్చ.. తెరపైకి  పలువురి పేర్లు

వికారాబాద్, మార్చి 02: వికారాబాద్ వేదికగా జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై పార్టీ అగ్రనేతలు మధ్య సోమవారం కీలక చర్చ జరిగింది. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నేతలను పార్టీ అగ్రనేతలు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయని బలమైన నేతలకు ఈ సీట్లు కేటాయించాలనే అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఎంపీల రేసులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లను ఈ సందర్భంగా వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ రాజ్యసభ సభ్యుల ఎంపికపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీని తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపేందుకు తెలంగాణ నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.


ఇంతకీ రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడూ..?

2026, ఫిబ్రవరి 18వ తేదీన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో ఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవులు ముగియనున్నాయి. వీరి పదవి కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది.


రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్.. కీలక తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26.

  • నామినేషన్ల దాఖలు చేసే చివరి తేదీ: మార్చి 5.

  • నామినేషన్ల పరిశీలన: మార్చి 6.

  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 9.

  • పోలింగ్: మార్చి 16, 2026 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

  • ఓట్ల లెక్కింపు: మార్చి 16, 2026 సాయంత్రం 5 గంటలకు (పోలింగ్ ముగిసిన వెంటనే.. అనంతరం గెలిచిన అభ్యర్థుల ప్రకటన)


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?

గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి

For More TG News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 06:04 PM