Share News

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్: కొప్పుల ఈశ్వర్

ABN , Publish Date - Apr 10 , 2026 | 07:46 PM

బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు టి. జీవన్ రెడ్డికి ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుందని ఆ పార్టీ నేత కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్: కొప్పుల ఈశ్వర్
BRS Leader Koppula Eshwar

సిద్దిపేట, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు టి. జీవన్ రెడ్డికి ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుందని ఆ పార్టీ నేత కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఈ సభలో బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరతారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో కొప్పుల ఈశ్వర్, ఎల్ రమణ సమావేశమయ్యారు. అనంతరం వీరు విలేకర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌ పార్టీలో జీవన్ రెడ్డి చేరతారని తెలిపారు.


ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు శనివారం జగిత్యాలలో స్థలాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతు సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై ఈ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ ప్లీనరీ సభకి ముందే పార్టీలో చేరికలు ఉంటాయన్నారు. కేసీఆర్‌తో కలిసి పని చేయడానికి జీవన్ రెడ్డి ముందుకు వచ్చారని చెప్పారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని జీవన్ రెడ్డికి కేసీఆర్ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.


ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్: ఎల్ రమణ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రజాక్షేత్రంలోకి రానున్నారని ఆ పార్టీ నేత ఎల్.రమణ వెల్లడించారు. ప్రజా సమస్యలపై ఇకపై నిరంతరంగా పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని ఎల్ రమణ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

60 అడుగుల బోర్‌వెల్‌లో మూడేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ

Read Latest TG News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 07:57 PM