Share News

జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్.. మంత్రి దామోదర సీరియస్

ABN , Publish Date - Aug 07 , 2026 | 02:31 PM

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాఖాలో ఫేక్ డాక్టర్ బాగోతం వెలుగుచూసింది. జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ వ్యవహారం బయటపడింది.

జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్.. మంత్రి దామోదర సీరియస్
Fake Doctor Case

సంగారెడ్డి, ఆగస్టు 7: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాఖాలో ఫేక్ డాక్టర్ బాగోతం వెలుగుచూసింది. జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ డాక్టర్ రమేశ్ తన స్థానంలో ప్రైవేట్ వైద్యుడితో ఉద్యోగం చేయిస్తున్నారు. డిప్యూటీ సివిల్ సర్జన్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రమేశ్ స్థానంలో ప్రైవేటు డెంటల్ వైద్యుడు రవి డాక్టర్‌గా చెలామణి అవుతున్నారు. వైద్యారోగ్య శాఖ విచారణలో ఈ విషయం బయడపింది.


ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. డ్యూటీకి డుమ్మా కొడుతూ తన స్థానంలో వేరొకరితో డ్యూటీ చేయిస్తున్న రమేశ్‌ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

ఐఏఎస్ సందీప్ కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

రెండో రోజుకు ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ.. ఐఫోన్‌పై లోతుగా దర్యాప్తు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 03:25 PM