Share News

విద్యార్థులు, రాహుల్‌కు మద్దతుగా ప్రతి రోజు నిరసనలు: జగ్గారెడ్డి

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:34 PM

మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి విమర్శించారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.

విద్యార్థులు, రాహుల్‌కు మద్దతుగా ప్రతి రోజు నిరసనలు: జగ్గారెడ్డి

సంగారెడ్డి, జులై 22: మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి విమర్శించారు. బుధవారం సంగారెడ్డిలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా ఢిల్లీలో నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వేలాది మంది యువత ఆందోళన బాట పట్టారని చెప్పారు. ఆందోళనకు దిగిన వారిని దారుణంగా రక్తం వచ్చేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడిస్తే.. ఆయన్ని కూడా అరెస్ట్ చేశారని అన్నారు.


విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని.. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్‌ గాంధీకి మద్దతుగా మంగళవారం హైదరాబాద్ - ముంబై నేషనల్ హైవే ముట్టడించామన్నారు. బుధవారం నల్ల దుస్తులతో నిరసన ర్యాలీ చేశామని చెప్పారు. గురువారం కూడా ఆందోళన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ టీషర్ట్‌లు ధరించిన వెయ్యి మంది కాంగ్రెస్ కేడర్‌తో ఈ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. రాహుల్, ప్రియాంకలతోపాటు విద్యార్థులకు మద్దతుగా ప్రతి రోజు నిరసన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. రాహుల్ గాంధీ ఆందోళన చేసినన్ని రోజులు సంగారెడ్డిలో ఆందోళనలు జరుగుతూనే ఉంటాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్

లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 05:41 PM