Share News

సంగారెడ్డి, సదాశిపేటలో కాంగ్రెస్ గెలుపు.. జగ్గారెడ్డి ఏమన్నారంటే?

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:46 PM

సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.

సంగారెడ్డి, సదాశిపేటలో కాంగ్రెస్ గెలుపు.. జగ్గారెడ్డి ఏమన్నారంటే?
Jagga Reddy

సంగారెడ్డి, ఫిబ్రవరి 13: సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) సంతోషం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఘనమైన విజయాన్ని అందించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 'పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు.


అలాగే ‘నేను ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను’ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఈ రెండు మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హామీ ఇచ్చారు.


కాగా.. సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 22 వార్డుల్లో విజయం సాధించింది. అలాగే బీఆర్ఎస్ 10, బీజేపీ 2 స్థానాల్లో గెలవగా.. ఇతరులు 4 వార్డుల్లో గెలిచారు. దీంతో ఛైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. సదాశివపేటలో మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 16, బీఆర్‌ఎస్ 8 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో స్థానం దక్కించుకున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం చేసి అభ్యర్థుల విజయానికి కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పైచేయి సాధించింది.


ఇవి కూడా చదవండి...

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ ‘హస్త’గతం

అలంపూర్ నియోజకవర్గం.. మూడు మున్సిపాలిటీల ఫలితాలివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 05:19 PM