Share News

ఎక్కడున్నాడో.. ఎం చేస్తున్నాడో..

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:56 AM

సైన్యంలో లాన్స్‌నాయక్‌గా పనిచేస్తున్న ఓ జవాన్‌ ఏడాది కాలంగా కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఎక్కడున్నాడో.. ఎం చేస్తున్నాడో..
Army soldier missing

  • ఏడాదిగా కనిపించని ఆర్మీ జవాన్‌

  • ఆచూకీ కోసం కుటుంబం ఆందోళన

  • ఆచూకీ కనిపెట్టాలని భార్య వేడుకోలు

అక్కన్నపేట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సైన్యంలో లాన్స్‌నాయక్‌గా పనిచేస్తున్న ఓ జవాన్‌ ఏడాది కాలంగా కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో తెలియక ఆర్మీ అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, తన భర్త ఆచూకీ చెప్పాలని జవాన్‌ భార్య వేడుకుంటోంది. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన తోట అనిల్‌కు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన అనూషతో 2023లో వివాహం జరిగింది. తోట అనిల్‌ (ఆర్మీ నంబర్‌: 15825830పీ) 2015 నుంచి భారత సైన్యంలో సికింద్రాబాద్‌ ఏవోసీ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నారు.


హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్‌లో విధులు నిర్వహిస్తుండగా, 2025 ఆగస్టు 8 నుంచి కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి అనిల్‌ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటున్న అనూష.. చంటి బిడ్డను తీసుకుని భర్త ఆచూకీ కోసం ఆర్మీ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, ఎంపీల చుట్టూ తిరుగుతున్నా భర్త ఆచూకీ మాత్రం దొరకలేదు. సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తి ఏడాదిగా కనిపించకుండా పోతే కనీసం పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా ఆర్మీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకుని తన భర్త ఆచూకీ కనిపెట్టాలని అనూష కోరుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

అరగంటపాటు గుండెను ఆపి.. ఆపరేషన్‌!

బీసీ సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 05:56 AM