Share News

బీసీ సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:49 AM

రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

బీసీ సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం
Bhatti Vikramarka

  • రూ.60 కోట్లతో 50 వేల మందికి కాటమయ్య రక్షణ

  • కవచాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీసీ సంక్షేమ శాఖపై సోమవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకు 1.30 లక్షల మంది విద్యార్థులకు ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల నిధులు రూ.450 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన ‘కాటమయ్య రక్షణ కవచాలు’ పథకం కింద ఇప్పటివరకు 50 వేల మందికి కిట్లు మంజూరు కాగా, ఇప్పటికే 40 వేల కిట్లను అందించామని తెలిపారు.


ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికీ కిట్లను అందిస్తామన్నారు. ఈ పథకం కోసం మొత్తం రూ.60 కోట్లను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని నవంబరు నుంచి ప్రారంభిస్తామని భట్టి తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో పెండింగ్‌ బిల్లులను త్వరలోనే క్లియర్‌ చేస్తామని హామీ ఇచ్చారు. గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలను మంజూరు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేయగా... ఆ అంశాన్ని పరిశీలిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.


ఈ ఏడాది ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద 180 మంది విద్యార్థులకు రూ.18.40 కోట్ల నిధులను విడుదల చేశామని చెప్పారు. ఈ పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 15 వరకు పొడిగిస్తున్నామని ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌’ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని భట్టి విక్రమార్క ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున నిర్మిస్తున్న ఈ భవనాల నిర్మాణానికి కలెక్టర్లతో కలిసి ఇంజనీరింగ్‌ అధికారులు వెంటనే ప్రత్యేక ‘వర్క్‌ క్యాలెండర్‌’ను రూపొందించాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అరగంటపాటు గుండెను ఆపి.. ఆపరేషన్‌!

తులం బంగారం ఇస్తామన్న వాళ్ల ఫొటోలు పోలీస్‌ స్టేషన్లలో పెట్టాలి!
Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 05:49 AM