జాబ్ కార్డుల్లో పేర్లు మాయం
ABN , Publish Date - Nov 03 , 2026 | 01:04 PM
కరువు పరిస్థితుల్లో ఉపాధి పనులు చేసుకుందామంటే జాబ్‌కార్డుల్లో పేర్లు కనిపించక పోవడంతో గిరిజన కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఉపాధి పనులకు దూరమైన గిరిజనులు
నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం
పాపన్నపేట(మెదక్): కరువు పరిస్థితుల్లో ఉపాధి పనులు చేసుకుందామంటే జాబ్‌కార్డుల్లో పేర్లు కనిపించక పోవడంతో గిరిజన కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డాక్యా, ధంజా, రాజ్యా, పోంలా తండాలకు చెందిన సుమారు 790 మంది పేర్లు జాబ్ కార్డు జాబితాలో లేకపోవడంతో ఉపాధి పనులకు దూరమవుతున్నాయని డాక్యా తండా సర్పంచ్ స్వప్న ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు పాపన్నపేట మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
నాలుగు తండాల్లో కలిపి 1,069 జాబ్ కార్డులు ఉండగా, గత నాలుగేళ్లుగా కేవలం 290 మంది పేర్లు మాత్రమే జాబితాలో కనిపిస్తున్నాయని ఆమె అధికారులకు వివరించారు. దీంతో వీబీజీరాంజీ పథకం కింద పనులు చేపట్టలేక పోతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారని, జాబ్‌కార్డుల్లో పేరు లేకపోతే పనులు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ సమస్యపై ఏళ్ల తరబడి అధికారుల చుట్టు తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి గిరిజనులందరి పేర్లను జాబ్ కార్డుల్లో నమోదు చేసి ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తున్న ఉల్లి
అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News