Share News

నేడు అచ్చంపేటకు సీఎం

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:41 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సుమారు రూ.450 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

నేడు అచ్చంపేటకు సీఎం

  • మద్దిమడుగులో సంత్‌ సేవాలాల్‌ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం

  • రూ.450 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • అచ్చంపేటలో బహిరంగ సభ

  • ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

హైదరాబాద్‌/అచ్చంపేట, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సుమారు రూ.450 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీతోపాటు చేయూత కింద కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి నేరుగా మద్దిమడుగుకు చేరుకుని.. అక్కడ రూ.18 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులకు, రూ.15 కోట్ల అంచనాతో ఆలయం సమీపంలో హరిత హోటల్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.38 కోట్లతో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ భారీ విగ్రహం, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.


అనంతరం అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణంలో రూ.274.32 కోట్లతో జిల్లా పరిధిలోని పలు బీటీ రోడ్లు, రూ.29.65 కోట్లతో నాగర్‌కర్నూల్‌, పెద్ద కొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటు, రూ.25 కోట్లతో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు, రూ.18.10 కోట్లతో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు గదుల నిర్మాణాలకు, రూ.16 కోట్లతో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పన, రూ.14 కోట్లతో ఆమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లో నూతన ఐటీడీఏ భవనం నిర్మాణం, రూ.2కోట్లతో అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ భవన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ వేదికగా ఇందిరమ్మ చీరలను, చేయూత కింద కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్‌ వెస్లీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 03:42 AM