Share News

డిండి వద్దు.. పాలమూరు ముద్దు

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:44 AM

‘పాలమూరు- రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నుంచి నల్లగొండకు తరలించే డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం (డీఎల్‌ఐ)ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కోదండరామ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

డిండి వద్దు.. పాలమూరు ముద్దు
Palamuru Ranga Reddy project

  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుల సాధన యాత్ర షురూ

వంగూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘పాలమూరు- రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నుంచి నల్లగొండకు తరలించే డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం (డీఎల్‌ఐ)ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కోదండరామ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామంలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ప్రారంభించారు.


అటుపై కోనాపూర్‌లో జరిగిన సభలో ఎమ్మెల్సీ కోదండరామ్‌, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. పాలమూరుకు కేటాయించిన నీటిని నల్లగొండకు తరలించడం సరి కాదని, సరిపడా నిధులు మంజూరు చేయనందుకే కల్వకుర్తి, పాలమూరు- రంగారెడ్డి, భీమా, కోయిలసాగర్‌ ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాఘవాచారి మాట్లాడుతూ..


నాగర్‌ కర్నూల్‌, ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 3.61 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారని చెప్పారు. ఒకవైపు జీవనాధారమైన సాగు భూములు కోల్పోయిన రైతులు సరైన నష్టపరిహారం అందక నష్టపోయారని, మరోవైపు వంగూరు మండలం ఉల్పర బ్యారేజీ నుంచి నల్లగొండ జిల్లా శివన్నగూడెం జలాశయం వరకూ 66 కి.మీ ప్రధాన కాలువతోపాటు 9 జలాశయాలను నిర్మిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఫ్యూచర్‌ సిటీ లేదు.. గాడిద గుడ్డూ లేదు..

పాముకాటుకు ఆరు నెలల పసికందు బలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 06:47 AM