పాముకాటుకు ఆరు నెలల పసికందు బలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:39 AM
పాముకాటుకు గురై ఆరు నెలల బాబు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగళాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
ములుగు జిల్లా వెంగళాపూర్‌లో విషాదం
తాడ్వాయి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పాముకాటుకు గురై ఆరు నెలల బాబు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగళాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈక తిరుపతి, స్వప్న దంపతులు తమ పాత ఇల్లు తొలగించి, అదే స్థలంలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. అందువల్ల వారు తాత్కాలికంగా పక్కనే ఒక చిన్న పాక వేసుకుని నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం స్వప్న తన ఆరు నెలల బాబు, రెండేళ్ల కూతురితో కలిసి నిద్రిస్తుండగా, ఒక పాము మంచంపైకి ఎక్కి పసికందును కాటేసింది.
పాము వెళ్తుండగా చూసిన తల్లి భయంతో కేకలు వేసింది. వెంటనే బాబును పరిశీలించగా పాము కాటేసిన ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే తిరుపతి 108కు సమాచారం అందించినప్పటికీ, సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో శిశువును సమీపంలోని గోవిందరావుపేట ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలోనే పసికందు ఊపిరి వదిలాడు. కళ్ల ముందే బాబు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఫ్యూచర్ సిటీ లేదు.. గాడిద గుడ్డూ లేదు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News