ఫ్యూచర్ సిటీ లేదు.. గాడిద గుడ్డూ లేదు..
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:32 AM
‘‘సీఎం రేవంత్ రెడ్డి మాటిమాటికీ ఫ్యూచర్ సిటీ అంటాడు.. కానీ హైదరాబాద్‌లో దోమలకు మందు కొట్టేటోడే లేడు. ఇక ఫ్యూచర్ సిటీలో ఏం చేస్తాడు. ఫస్ట్ హైదరాబాద్‌ను పట్టించుకోండి. ఫ్యూచర్ సిటీ లేదు.. గాడిద గుడ్డూ లేదు.. అదో హైదరాబాద్ ఫార్మాసిటీ’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
నల్లమల పులిబిడ్డ పొరుగు రాష్ట్ర సీఎంకు దాసోహం: కేటీఆర్
శంషాబాద్/సిరిసిల్ల/నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం రేవంత్ రెడ్డి మాటిమాటికీ ఫ్యూచర్ సిటీ అంటాడు.. కానీ హైదరాబాద్‌లో దోమలకు మందు కొట్టేటోడే లేడు. ఇక ఫ్యూచర్ సిటీలో ఏం చేస్తాడు. ఫస్ట్ హైదరాబాద్‌ను పట్టించుకోండి. ఫ్యూచర్ సిటీ లేదు.. గాడిద గుడ్డూ లేదు.. అదో హైదరాబాద్ ఫార్మాసిటీ’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మణికొండ, శంషాబాద్ మండలాల ముఖ్య నాయకులు బీఆర్‌ఎ్‌సలో చేరారు. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పని కూడా అయిపోయిందని, ఘంసిమియాగూడ, కొత్వాల్‌గూడ భూములు రక్షించుకోవడం కోసమే కాంగ్రె్‌సలో చేరాడని ఆరోపించారు.
రేపు తమ ప్రభుత్వం వచ్చాక విడిచిపెట్టబోమని ఆయనను హెచ్చరించారు. కాగా, సీఎంగా తొలిసారి సిరిసిల్లకు వస్తున్న రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్వాగతం పలుకుతూ పలు ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నాయకులు 8వేల ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని, అందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో పేర్కొన్న సీఎం..ఆ భూముల వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నాగర్‌కర్నూల్ జిల్లాలోనూ పర్యటించారు. దేశిటిక్యాలలో ఎండిన పంటలను పరిశీలించారు. నల్లమల పులి బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి కృష్ణా జలాల అంశంలో పొరుగు రాష్ట్ర సీఎంకు దాసోహమయ్యారని ఆరోపించారు. శ్రీశెలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీళ్లున్నా వినియోగించుకోలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చేతులెత్తేసిన కొత్త కాంట్రాక్టర్?!
Read Latest AP News And Telangana News And International News And Telugu News