Share News

ప్రేమికుడి మోసం.. ప్రియురాలి ఆత్మహత్య!

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:23 AM

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడనే మనస్తాపంతో ఓ దళిత యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా నడివాడ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది.

ప్రేమికుడి మోసం.. ప్రియురాలి ఆత్మహత్య!
Mahabubabad Woman Death

  • పెళ్లికి నిరాకరించడంతోయువతి బలవన్మరణం

మహబూబాబాద్‌ రూరల్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడనే మనస్తాపంతో ఓ దళిత యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా నడివాడ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. మూడేళ్లుగా ప్రేమించి, వివాహం చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేశాడంటూ మృతురాలు 18 పేజీల సూసైడ్‌లో వెల్లడించింది. ఎస్సీ వర్గానికి చెందిన మునిగె కుమారస్వామి- సుకన్య దంపతుల పెద్దకుమార్తె సుస్మిత (26) డిగ్రీ పూర్తి చేసి, కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతోంది. అదే గ్రామానికి చెందిన శామకూరి అనిల్‌ అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఆమెను మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే, వివాహం విషయం వచ్చేసరికి అనిల్‌ పెళ్లికి నిరాకరించడంతో సుస్మిత తీవ్ర మనోవేదనకు గురైంది.


గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు వచ్చే సరికి ఆమె విగతజీవిగా పడి ఉంది. మృతురాలు రాసిన సూసైడ్‌నోట్‌లో అనిల్‌ తనను మానసికంగా, శారీరకంగా చిత్రవధకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏ రోజూ అనిల్‌ తనతో నమ్మకంగా ప్రవర్తించలేదని వాపోయింది. మోసం చేసిన సదరు యువకుడిని ఉరి తీయాలని లేఖలో పేర్కొంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనిల్‌తో పాటు మరో 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సుస్మిత ఆత్మహత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలంటూ మృతురాలి బంధువులు, దళిత సంఘాల నాయకులు జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 06:23 AM