Share News

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 200 గొర్రెల సజీవ దహనం

ABN , Publish Date - Sep 10 , 2026 | 07:54 AM

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 200లకు పైగా మూగ జీవాలు సజీవ దహనమయ్యాయి. వివరాల్లోకి వెళితే..

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 200 గొర్రెల సజీవ దహనం

మహబూబ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని భూత్పూర్ జాతీయరహదారిపై ఈ రోజు(గురువారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున గొర్రెల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం.. జాతీయ రహదారి పక్కన ఉన్న రైలింగ్ బోర్డు సూచికను ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి.


ఈ ప్రమాదంలో డ్రైవర్ రషీద్ ఖాన్ వాహనం నుంచి బయటకు దూకేసి ప్రాణాలతో బయటపడ్డాడు. వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కానీ, గొర్రెలను డీసీఎంలో లాక్ చేయడం వల్ల అవి ఎటూ పారిపోలేకపోయాయి. మంటల్లో చిక్కుకుని 200కు పైగా గొర్రెలు సజీవ దహనమయ్యాయి.

గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు

Read Latest AP News And Telangana News

Updated Date - Sep 10 , 2026 | 09:11 AM