బాదేపల్లి మార్కెట్‌లో ధాన్యానికి రికార్డు ధర
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:05 AM
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి రికార్డు ధర పలికింది.
ఆర్‌ఎన్‌ఆర్ రకం క్వింటాలుకు రూ.3996
జడ్చర్ల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి రికార్డు ధర పలికింది. సోమవారం రైతులు ఇక్కడికి 11,564 క్వింటాళ్ల ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యాన్ని విక్రయానికి తీసుకురాగా... క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 3996 ధర పలికి ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది.
కనిష్ఠంగా రూ. 2509, మోడల్ ధర రూ. 3559 పలికింది. ఈ మార్కెట్‌కు ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యాన్ని గత నెల 27 నుంచి విక్రయానికి తెస్తున్నారు. మొదటిరోజు క్వింటాలుకు రూ.3416 పలుకగా తాజాగా రూ. 3996 పలికింది. కేవలం 20 రోజుల వ్యవధిలో క్వింటాలుకు రూ.580 పెరిగింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News