Share News

పాలిచ్చే బర్రెను కాదని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నరు: కేటీఆర్‌

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:13 AM

‘‘మోసగాళ్లను ప్రజలు నమ్ముతారని రేవంత్‌ రెడ్డి ముందే చెప్పారు. పాత రోజులు తెస్తానని కూడా చెప్పారు. రేవంత్‌ నిజాయితీ గల మోసగాడు. తెలంగాణ ప్రజలు పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నరు’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

పాలిచ్చే బర్రెను కాదని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నరు: కేటీఆర్‌
KTR

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘మోసగాళ్లను ప్రజలు నమ్ముతారని రేవంత్‌ రెడ్డి ముందే చెప్పారు. పాత రోజులు తెస్తానని కూడా చెప్పారు. రేవంత్‌ నిజాయితీ గల మోసగాడు. తెలంగాణ ప్రజలు పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నరు’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన పలువురు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రె్‌సకు సమయం ఇవ్వాలని చెప్పారని పేర్కొన్నారు. మూడేళ్లు కేసీఆర్‌ బయట కనిపించకపోయినా గల్లీ గల్లీలో కేసీఆర్‌ పాటలు వినిపిస్తున్నాయని, ప్రజల గుండెల్లో ఆయన గూడుకట్టుకుని ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వరినాట్లు వేసే సమయానికి రైతు బంధు డబ్బులు ఇచ్చేవాళ్లమని.. సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికి మూడుసార్లు రైతు బంధు ఎగ్గొట్టారని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
నవంబరు నెలాఖరులో.. హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ!

ఎస్సారెస్పీ నిర్వాసితురాలికి 2 వారాల్లోపు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వండి: హైకోర్టు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 06:13 AM