నవంబరు నెలాఖరులో.. హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ!
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:58 AM
హైదరాబాద్-విజయవాడ- మచిలీపట్నం (ఎన్‌హెచ్-65) జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరిస్తున్నామని, నవంబరు చివరి నాటికి పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం ప్రకటించారు.
ఇప్పటికే టెండర్ ప్రక్రియ షురూ : మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-విజయవాడ- మచిలీపట్నం (ఎన్‌హెచ్-65) జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరిస్తున్నామని, నవంబరు చివరి నాటికి పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం ప్రకటించారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. రూ.12,073.99 కోట్ల అంచనా వ్యయంతో 285.99 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించారని గుర్తు చేశారు. ఇప్పుడు పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆరు వరుసల విస్తరణకు టెండర్లు పడేలా చేశామన్నారు. నవంబర్ చివరికల్లా పనులు ప్రారంభించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. దసరా నాటికి ధర్మోజిగూడ, చిట్యాల ఫ్లైఓవర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. సంక్రాంతి నాటికి మిగిలిన అన్ని బ్లాక్ స్పాట్లలో ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని చూసిన కేటీఆర్
ఆయుధాల చోరీ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News