Share News

రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Jul 31 , 2026 | 08:22 AM

రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేను పూర్తి చేసి.. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో గురువారం కల్లూరు, తల్లాడ మండలాల స్థాయి ప్రజాదర్బార్‌ను నిర్వహించారు.

రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

  • ‘ధరణి’లో అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

  • అది పూర్తయ్యాక ప్రజల ముందుకు అక్రమాల చిట్టా

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


కల్లూరు (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేను పూర్తి చేసి.. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో గురువారం కల్లూరు, తల్లాడ మండలాల స్థాయి ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఖమ్మం కలెక్టర్‌ దివాకర, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ధరణి వ్యవస్థ ద్వారా జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. అది పూర్తయ్యాక పేదల భూములు ఎలా అన్యాక్రాంతం అయ్యాయో.. ప్రభుత్వ భూముల అక్రమ బదిలీలు.. తదితర అన్ని అవకతవకల వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచబోతోందన్నారు. గత పాలకులు తమ ప్రభుత్వంపై రూ. 8.50లక్షల కోట్లు అప్పు భారం మోపినా.. పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందడుగు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి కుల, మత, పార్టీల తేడాల్లేకుండా దశల వారీగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామన్నారు.


ఇవీ చదవండి:

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

తలసేమియా బాధితులకు పింఛన్లు

Updated Date - Jul 31 , 2026 | 08:22 AM