నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ చెల్లింపు
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:05 AM
సింగరేణి కార్మికులకు దీపావళి బోన్‌సను గురువారం చెల్లించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది.
కొత్తగూడెంటౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు దీపావళి బోన్‌సను గురువారం చెల్లించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 38 వేల మంది కార్మికులకు ఒక్కోక్కరికి రూ.1,10,250 చొప్పున పర్ఫార్మెన్స్ రిలేటెడ్ లింక్‌డ్ రివార్డు (పీఎల్‌ఆర్) బోన్‌సను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కోల్ ఇండియాలో పనిచేస్తున్న కార్మికులందరితో పాటు సింగరేణిలో 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు రిటైర్ అయిన సుమారు 8,351 మంది కార్మికులకు కూడా బోనస్‌ను చెల్లించేలా చర్యలు చేపట్టారు. పండుగకు ముందే బోనస్‌లు చెల్లించడం పట్ల కార్మికులు, కార్మిక సంఘాలు హర్షం ప్రకటించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News