అదుపులోకి అశ్వపురం క్లోరిన్ గ్యాస్ లీకేజ్.. తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:01 AM
భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురంలోని మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబరు 25: జిల్లాలో అశ్వపురం మండలంలోని మిట్టగూడెం రథంగుట్ట వద్ద గల మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్లో మూడు రోజులుగా క్లోరిన్ గ్యాస్ లీకవుతున్న ఘటనపై అధికారులు ఎట్టకేలకు స్పందించారు. గ్యాస్ లీకవుతున్న 1600 కిలోల కెపాసిటీ గల సిలిండర్ను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారు.
భద్రాద్రి జిల్లాలోని అశ్వపురం మండలంలోని మిట్టగూడెం రథంగుట్ట వద్ద గల మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్లో క్లోరిన్ గ్యాస్ లీక్ కలకలం రేపింది. మూడు రోజులుగా గ్యాస్ లీకవుతున్నా.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు.. లీకేజీపై వార్తా కథనాలు రావడంతో అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. గ్యాస్ లీక్ అవుతోన్న 1600 కిలోల కెపాసిటీ గల సిలిండర్ను గుర్తించారు. అర్థరాత్రి ఈ గ్యాస్ సిలిండర్ వాల్వ్ విప్పి.. దానికి పైప్ అమర్చి.. నీటి కాలువలోకి వదిలారు. విషవాయువు ప్రభావం సమసిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. సమీప గ్రామ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి