ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:10 PM
ఖమ్మం జిల్లాలోని వి.వెంకటాయపాలెంలో వెటర్నరీ ఆసుపత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వెంకటాయపాలెం గ్రామానికి జిల్లాలో ఓ చరిత్ర ఉందన్నారు.
ఖమ్మం జిల్లా, జూన్ 8: జిల్లాలోని వి. వెంకటాయపాలెంలో వెటర్నరీ ఆసుపత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు(సోమవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వెంకటాయపాలెం గ్రామానికి జిల్లాలో ఓ చరిత్ర ఉందన్నారు. ఎన్టీరామారావుతో ఈ గ్రామానికి వచ్చి ఇక్కడే భోజనం చేసినట్లు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇక్కడ భూగర్భ జలాలు లేకపోతే లిఫ్ట్ పెట్టమని అడిగితే, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో లిఫ్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం పెట్టాలని ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోచోట పెట్టాలని కోరితే... వి.వెంకటాయపాలెంలో పెట్టినట్లు చెప్పారు.
ప్రతి పని పదికాలాల పాటు ఉండేలా చేయించాలని మంత్రి అన్నారు. వెంకటాయపాలెం గ్రామాన్ని తన శక్తి మేరకు అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ‘మనకు పని చేసే మంచి ఆర్డీవో వచ్చారు.. ఆయనతో భూమి సర్వే చేయించుకోండి’ అని అన్నారు. ఇళ్ల స్థలాలు నిజమైన పేద వాళ్లకి ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి
పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసు.. దొరకని బంగారు ఆభరణాలు
Read Latest Telangana News And Telugu News