మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:41 AM
సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్‌హౌస్ సమీపంలో రూ.25 కోట్లతో నిర్మించిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం బుధవారం ప్రారంభమైంది.
లిఫ్ట్ నుంచి తుమ్మల చెరువుకు నీటి విడుదల
గోదావరి జలాలకు మంత్రులు తుమ్మల, పొంగులేటి పూజలు
అశ్వాపురం సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్‌హౌస్ సమీపంలో రూ.25 కోట్లతో నిర్మించిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసి పథకాన్ని రైతులకు అంకితం చేశారు. మారెళ్లపాడు నుంచి అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువుకు నీటిని విడుదల చేసిన మంత్రులు గోదావరి జలాలకు పూజలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి వనరుల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం కుడి, ఎడమ కాలువల ద్వారా దశల వారీగా అశ్వాపురం, పినపాక మండలాల్లోని 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి నిధులు విడుదల చేశారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల సంఘం విశ్వసనీయతను కోల్పోతోంది
త్వరలో విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News