భద్రాద్రి రాముల వారి కల్యాణ మహోత్సవానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:48 PM
భద్రాద్రి రాములవారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షల మంది భక్తులు ఆలయానికి చేరుకుని పెళ్లి వేడుకను కనులవిందుగా తిలకించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగలేటి సహా పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రాములవారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షల మంది భక్తులు ఆలయానికి చేరుకుని పెళ్లి వేడుకను కనులవిందుగా తిలకించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగలేటి సహా పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి కుటుంబసమేతంగా సారపాక హెలిప్యాడ్‌కు చేరుకున్నారు రేవంత్.

అనంతరం రోడ్డుమార్గాన భద్రాద్రి రాములవారి ఆలయం వద్దకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్ల వివాహ మహోత్సవానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు మిథిలా స్టేడియంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం సారపాక హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా, ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. రాములోరి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఈ వార్తలు కూడా చదవండి
శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ పవిత్రతకు ప్రతీక: తెలంగాణ గవర్నర్ భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం