శోభాయాత్ర వేళ.. సీపీ వార్నింగ్
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:34 PM
శోభాయాత్ర వేళ.. వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయ వద్దని ప్రజలకు నగర సీపీ సజ్జనార్ సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్, మార్చి 28: నగరంలో జరిగే శ్రీరాముడి శోభాయాత్రకు పోలీస్ శాఖ వైపు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుంచి ఈ శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. రాత్రి 10 గంటల వరకు ఈ యాత్ర ముగించేలా రూట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వివరించారు.
ఇప్పటికే శోభాయాత్ర జరిగే మార్గాలను పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. దాదాపు 3 వేల మంది సిబ్బందితో ఈ శోభాయాత్రకు భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. పిక్ పాకెటర్స్‌పై నిఘా కోసం క్రైమ్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
షీ టీంలు కూడా శోభాయాత్ర వెంట ఉంటాయన్నారు. ఈ శోభాయాత్ర వేళ.. వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయ వద్దని ప్రజలకు సూచించామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర ప్రజలకు ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వార్నింగ్ ఇచ్చారు. గతంలో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు చేపట్టామని నగర సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
వేసవిలో మజ్జిగను ఇలా చేసుకు తాగితే..
For More TG News And Telugu News