Share News

భద్రాద్రి జిల్లా మిషన్ భగీరథ ప్లాంట్‌లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ కలకలం

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:33 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మిషన్ భగీరథ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో క్లోరిన్ వాయువు లీకైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భద్రాద్రి జిల్లా మిషన్ భగీరథ ప్లాంట్‌లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ కలకలం
chlorine gas leak

భద్రాద్రి కొత్తగూడెం, నవంబరు 24: జిల్లాలోని అశ్వాపురం మండలంలోని పాములపల్లి రథంగుట్టలో గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో క్లోరిన్ గ్యాస్ పైప్ లీకైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల నుంచి క్లోరిన్ గ్యాస్ లీకవుతున్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..


జిల్లాలోని అశ్వాపురం మండలంలోని పాములపల్లి రథంగుట్టలో గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో మూడు రోజులుగా క్లోరిన్ వాయువు లీకవుతోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతం కావడంతో మూడు రోజులుగా లీకవుతున్న ఈ విషవాయువును పీల్చుకున్న పాములు, కప్పలు, పలు కీటకాలు మృతి చెందాయి. ఈ వాయువు ప్రభావంతో మొక్కలు, చెట్లు మాడిపోయాయి. ఈ వాయువు చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకోవడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో గల రైతులు పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 24 , 2026 | 11:35 AM