సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు..
ABN , Publish Date - Mar 29 , 2026 | 08:00 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓసీ-2లో డంపర్ వాహనం టైరు పేలి ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు ఏరియా సింగరేణిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓసీ-2లో డంపర్ వాహనం టైరు పేలి ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ(ఆదివారం) ఉదయం షిఫ్టులో టైరు పట్టేయడంతో డంపర్‌ను కార్మికులు అక్కడే నిలిపేశారు.
బ్రేక్ డౌన్ అయిన డంపర్‌ను రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా టైర్ పేలింది. భారీ పేలుడు ధాటికి ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. మృతిచెందిన, గాయపడిన కార్మికులంతా బిహార్ రాష్ట్రానికి చెందినవారిగా తెలుస్తోంది. ప్రమాదం గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..
గోదావరి పుష్కరాలు-2027.. భక్తులకు ఏ చిన్న సమస్యా రాకుండా చూసుకోవాలి: సీఎం రేవంత్